కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని సిరాలదొడ్డి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని లోకేశ్, వీరేశ్ అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సిరాలదొడ్డిలో దేవరకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
మృతుడు లోకేశ్ ది ఎమ్మిగనూరు మండలంలోని కడివేళ్ల గ్రామం కాగా.. ఇతడికి రెండు నెలలు క్రితమే వివాహమైంది. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీరేశ్ సి.బెలగల్ గ్రామానికి చెందిన వాసని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను శవపరీక్ష కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: