రెండు వేర్వేరు ప్రదేశాల్లో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని కర్నూలు జిల్లాలోని ఆదోని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి తుపాను వాహనం, ద్విచక్ర వాహనం, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. సరకును కర్ణాటక నుంచి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక సీఐ శ్రీరాములు హెచ్చరించారు.
ఇదీ చదవండి: