కరోనా కారణంగా శ్రీశైలానికి నిలిచిపోయిన పర్యాటక బస్సు సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కార్తిక మాసం సందర్భంగా నాగార్జున్‌సాగర్ జలాశయం నుంచి శ్రీశైలం, సోమశిల నుంచి శ్రీశైలం వరకు సాగే పర్యాటక ప్యాకేజీలను మంగళవారం ఆయన పర్యటక శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, సంస్థ ఎండీ మనోహర్‌తో కలిసి విడుదల చేశారు. నామమాత్ర ధరలతో ఈ ప్యాకేజీలను నిర్ణయించామని మంత్రి అన్నారు. పెద్దలకు రూ.3,499, పిల్లలకు రూ.2,800 ఛార్జీలతో ఆలయ దర్శనం, భోజన సదుపాయం, ఈగలపెంటలోని టూరిజం హోటల్‌లో బస సౌకర్యం ఉంటుందన్నారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: