బాలయ్య బాబు డైలాగ్‌తో కరోనాపై ప్రజలకు అవగాహన
బాలయ్య బాబు డైలాగ్‌తో కరోనాపై ప్రజలకు పోలీసులు అవగాహన - కర్నూలులో కరోనా వైరస్‌పై అవగాహన ర్యాలీ
మహమ్మరి కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కర్నూలులో పోలీసులు బుధవారం అవగాహన ర్యాలీ చేపట్టారు. కరోనా వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. 'నేను మీకు ఎదురొచ్చినా... మీరు నాకు ఎదురొచ్చినా మీకే నష్టం' అంటూ లెజెండ్ చిత్రంలోని డైలాగ్‌లతో ఫ్లెక్సీలు ప్రదర్శించారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ సాగింది.
![బాలయ్య బాబు డైలాగ్‌తో కరోనాపై ప్రజలకు పోలీసులు అవగాహన to-be-vigilant-against-corona-virus-police-rally](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6627285-21-6627285-1585787574814.jpg?imwidth=3840)
to-be-vigilant-against-corona-virus-police-rally
బాలయ్య బాబు డైలాగ్‌తో కరోనాపై ప్రజలకు అవగాహన
ఇదీ చదవండి:
'రోడ్లపై అనవసరంగా తిరగం.. దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం'