Tiger crossing the road in Srisailam: నల్లమల అడవుల్లో శ్రీశైలం వెళ్లే దారిలో వాహనదారులకు పెద్దపులి కనిపించింది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల - తుమ్మలబైలు ఘాట్లో ఈ రోజు ఉదయం పెద్దపులి రహదారి దాటుతూ వాహనదారులకు కనిపించింది. దోర్నాల నుంచి శ్రీశైలం వైపు వాహనాల్లో యాత్రికులు వస్తుండగా పెద్దపులి రోడ్డు దాటుతుండగా వారు సెల్ఫోన్లలో చిత్రీకరించారు. పెద్దపులిని చూసి ఆశ్చర్యచకితులయ్యామని వారు తెలిపారు. చలికాలం కావడంతో పెద్దపులి బయటకు వస్తుంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సీజన్లో పెద్దపులి శ్రీశైలం సమీప సాక్షి గణపతి సమీపంలో యాత్రికులకు కనిపించింది. పెద్ద పులులు తరచూ కనిపించడం పులుల పెరుగుతుందన్న వాదనకు బలం చేకూరుస్తోంది.
ఇవీ చదవండి: