పట్టపగలు అందరినీ నమ్మించి.. బస్టాండ్లో చనిపోయిన ఓ వృద్ధుడి నుంచి రూ.1500 దోచుకెళ్లాడో దొంగ. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ సంఘటన జరిగింది. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో వెంకటేశ్వర్లు అనే 60 ఏళ్ల వృద్దుడు అనారోగ్యంతో మృతి చెందాడు. మృతి చెందక ముందు దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు వద్దకు ఓ గుర్తుతెలియని వ్యక్తి చేరాడు. అతని వద్ద ఉన్న డబ్బులను గమనించి…వాటిని కాజేయాలని చూశాడు. అప్పటికే ఆ వృద్ధుడు హఠాత్తుగా మరణించాడు. అతని వద్దనున్న రూ.9,500 నగదును ఈ దుండగుడు తీస్తుండగా..స్థానికులు చూసి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.
మృతుడు తన తండ్రి అవుతాడని వారికి మాయమాటలు చెప్పి నమ్మబలికాడు. ఈ విషయాన్ని ఆర్టీసి సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వారు వచ్చేలోపు అతను తన తండ్రి అని అంబులెెన్స్ తీసుకురావాలని వారికి అబద్ధాలు చెప్పి రూ. 1500 ఇవ్వాలని కోరాడు. వారు అతనిని నమ్మి ఇవ్వగా.. దుండగుడు డబ్బులతో ఉడాయించాడు. . ఎంతకీ రాకపోవడంతో అప్పటికే సమాచారం అందుకున్న బంధువులు మృతదేహాన్ని తీసుకెళ్లారు. దొంగ నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 8,000 అక్కడి సిబ్బంది బంధువులకు అందజేశారు. స్థానికులు దొంగ ఫోటో తీశారు. మృతుడు వెంకటేశ్వర్లు బనగానపల్లె మండలం ఫలుకూరు గ్రామానికి చెందిన వ్యక్తి కాగా.. తరుచూ బస్టాండు ప్రాంతంలో తిరిగేవాడు.
ఇదీ చూడండి.