కర్నూలులో పగటి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న గజదొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడిని విశాఖపట్నానికి చెందిన పాత నేరస్థుడు వారణాసి అనంత కుమార్‌గా గుర్తించారు. కర్నూలులో 15 రోజుల్లో దాదాపు 10 ఇళ్ల దొంగతనాలు జరిగాయని పోలీసులు తెలిపారు.
నగరంలోని ఎన్ఆర్పేటలో ఓ అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడిన తర్వాత అనంతకుమార్‌ను పట్టుకున్నామన్నారు. కర్నూలులో 3 చోరీలు చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో అతడిపై 40కి పైనే కేసులున్నాయన్నారు.
ఇదీ చదవండి: