కర్నూలులోని షరీన్నగర్లో 44వ నంబరు జాతీయ రహదారి పక్కన 4 దుకాణాల్లో చోరీ జరిగింది. ముబారక్ మొబైల్ షాపు తాళం పగులకొట్టి దొంగతనం చేశారు. దుకాణంలో ఉన్న రూ.60 వేలు నగదు, రూ.40 వేలు విలువైన సెల్ ఫోన్లు, విడిభాగాలు చోరీ అయినట్లు బాధితుడు తెలిపాడు. అక్కడున్న సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి వెళ్లిపోయారని చెప్పాడు.
సమీపంలోని ఏ జెడ్ మెడికల్ షాపు, తిరుమల, శ్రీనివాస పాల డెయిరీల్లోనూ దొంగలు చొరబడ్డారు. వాటిల్లో రూ.30 వేలు అపహరణకు గురయ్యాయి. మరో మెడికల్, జిరాక్స్ షాపుల్లో చోరీకి విఫలయత్నం చేశారు. దొంగతనం జరిగిన దుకాణాలను పోలీసులు పరిశీలించారు. ఒక్కడే కారులో వచ్చి దొంగతనం చేసినట్లు సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. కానీ వాహనంలో మరికొంత మంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షేక్నూర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: