కార్గిల్ యుద్దం జరిగి 20 సంవస్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ కర్నూల్లో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్గిల్ యుద్దంలో పాల్గొన్న మాజీ సైనికులు, ఎన్సీసీ విద్యార్ధులు పాల్గొన్నారు. నగరంలోని సీ.క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్దంలో పాల్గొన్న మాజీ సైనికులు తమ అనుభవాలు గుర్తు చేసుకున్నారు.
అమర జవాన్ల త్యాగం స్ఫూర్తిదాయకం - kurnool
1999లో జరిగిన కార్గిల్ యుద్దంలో పాకిస్థాన్ సైన్యాన్ని భారత్ సైనికులు తరిమికొట్టారు. ఆ విజయానికి 20 ఏళ్లు పూర్తయింది. అమరుల స్ఫూర్తిని చాటుతూ కర్నూలు విజయ్ దివాస్ నిర్వహించారు.