తుంగభద్ర నదిలో రెండున్నర నెలలుగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో.. కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద జలకళ సంతరించుకుంది. ఎగువ కర్ణాటక ప్రాంతంలో వర్షాలు అధికంగా కురవడంతో.. టీహీ డ్యాం నుంచి దిగువకు నీటిని వదులుతున్నారు. రెండున్నర నెలలుగా 40 నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తూనే ఉంది.
ఈ నీరు మంత్రాలయం మీదుగా సుంకేసుల జలాశయానికి చేరుతోంది. దీనివల్ల నదీ తీరం వెంట ఉన్న గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్య లేదని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ బామ్మ వయసు 60 కాదండోయ్.. పదహారే!