ETV Bharat / state

గాజులదిన్నెకు జలకళ... ఈసారైనా తీరేనా రైతు కల..? - గాజులదిన్నె ప్రాజెక్టుకు భారీగా నీరు

కొన్నేళ్లుగా నీరు లేక వెలవెలబోయిన గాజులదిన్నె ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా నీరు చేరి... నిండుకుండను తలపిస్తోంది. మూడేళ్లుగా... తాగునీటి అవసరాలకు మాత్రమే పరిమితమైన ఈ ప్రాజెక్టు నుంచి... ఈ ఏడాదైన సాగు అవసరాలకు నీరు విడుదల చేస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గాజులదిన్నె
author img

By

Published : Oct 31, 2019, 8:33 PM IST

గాజులదిన్నె ప్రాజెక్

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా... డోన్ మున్సిపాలిటీతో పాటు కృష్ణగిరి, పత్తికొండ మండలాల్లోని సుమారు 100 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. రబీలో సుమారు 24వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. మూడేళ్లుగా సరైన వర్షాలు లేక... ఈ ప్రాజెక్టు తాగునీటి అవసరాలకే పరిమితమైంది. ఆయకట్టు రైతులకు సాగునీరు అందక నష్టపోయారు.

ఇటీవల కురిసిన వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చింది. ఇప్పటికే 3 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి వరద ఇంకా వస్తుండటంతో... ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మూడేళ్లుగా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయామని... కనీసం ఈ ఏడాదైనా సాగునీరు ఇవ్వాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Intro:ap_knl_31_26_gajuladhinne_project_pkg_ap10130 యాంకర్:కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్ట్ ఈ ఏడాది కురిసిన వర్షాలకు జలకళ సంతరించుకుంది. దీంతో ప్రాజెక్ట్ కింద రబీ సాగుపై రైతుల్లో ఆశలు చిగురించాయి. వాయిస్ ఓవర్ 1,గాజులదిన్నె ప్రాజెక్ట్ ద్వారా డోన్ మున్సిపాలిటీ తో పాటు కృష్ణగిరి, పత్తికొండ మండలాల్లో దాదాపుగా వంద గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. రబీలో ఇరవై నాలుగున్నర వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. మూడేళ్లుగా వర్షాలు లేక జలాశయం నిండక ప్రాజెక్ట్లో చేరిన నీరు తాగునీటి అవసరాలకు సరిపోయింది. రబీకి సాగునీరు అందక రైతులు బీళ్లుగా వదిలారు. బైట్స్:1,2,3, 4, వాయిస్ ఓవర్2,ఆయకట్టు రైతులు,ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురియడంతో ప్రొజెక్టులోకి ఇప్పటికే మూడు టీఎంసీ ల నీరు చేరింది. ప్రొజెక్టులోకి ఎగువ నుంచి నీరు ప్రవహిస్తుండటం తో ప్రాజెక్ట్ పూర్తి నీటి సామర్థ్యం చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బైట్:రాజ్ కుమార్, ప్రాజెక్ట్, డీఈఈ, దీంతో ఈసారి రబీకి సాగునీరు ఇస్తారని రైతులు రబీ సాగుకు సమాయత్తమవుతున్నారు. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794

Body:గాజులదిన్నె

Conclusion:ప్రాజెక్ట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.