తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఎంపీ టీజీ వెంకటేశ్ మండిపడ్డారు. కృష్ణా జలాలపై కేసీఆర్ ఆయన మంత్రులు రోజుకోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నికల కోసం జలవివాదం తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి కోసమే అంటున్న తెలంగాణ నాయకులు.. మరి ఇన్ని రోజులు ఇరిగేషన్ కోసం ఎందుకు వాడుకున్నారని నిలదీశారు. కేసీఆర్ ఆమోదంతోనే రెండు రాష్ట్రాల మధ్యం 2015లో ఒప్పందం జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఆ అగ్రిమెంట్ కాదంటే మేం తిరిగి సమైక్యాంధ్ర ఉండాలని కోరుతామన్నారు.
రాష్ట్రానికి చెందిన జలాల విషయంలో రాష్ట్ర నాయకులంతా ఒకే తాటిపై నడవాలని హితవు పలికారు. రాయలసీమ జలాలపై రెండు, మూడు రోజుల్లో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి..
కృష్ణానది జలవిద్యుత్ ఉత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టులో విచారణ