ETV Bharat / state

కాళీమాత ఆలయ నిర్మాణం@12 గంటలే! - temple constructed in 12 hours

దేవాలయం కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది. అందంగా తీర్చిదిద్దితే.. ఏళ్ల సమయం కూడా పట్టొచ్చు. కొంతమంది భక్తులు మాత్రం కేవలం 12 గంటల్లోనే కాళిమాత ఆలయం కట్టేశారు తెలుసా.

ఈ భక్తులు 12 గంటల్లో గుడి కట్టారు
ఈ భక్తులు 12 గంటల్లో గుడి కట్టారు
author img

By

Published : Dec 2, 2019, 8:27 PM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పాత కందుకూరు గ్రామంలో కాళీకామాత ఆలయాన్ని... భక్తులు కేవలం 12 గంటల వ్యవధిలోనే నిర్మించారు. గ్రామ శివారులోని భైరవ స్వామి ఆలయం పక్కన ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. భైరవ స్వామి ఆలయ ధర్మకర్త లక్ష్మీనరసింహశాస్త్రి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. శక్తి పీఠాన్ని కేవలం 12 గంటల్లో నిర్మిస్తే అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ గ్రామస్థులు 12 గంటల్లో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. కావలసిన శిల్పాలు, రాళ్లను... నిర్మాణానికి ముందే సిద్ధం చేసుకున్నారు. అవసరమైన చోట పెద్ద పెద్ద యంత్రాలనూ వినియోగించారు.

ఈ భక్తులు 12 గంటల్లో గుడి కట్టారు
ఇదీ చదవండి :

వజ్రాలు ఉంటాయని ఆలయంలో విగ్రహం చోరీ

Intro:ap_knl_102_02_alaya_nirmanam_plg_ap10054 ఆళ్లగడ్డ8008574916 సాధారణంగా ఒక ఆలయాన్ని నిర్మించాలంటే నెలలు సంవత్సరాల సమయం పడుతుంది చిన్న ఆలయ నిర్మాణం విషయంలోనూ దాదాపుగా ఇదే సమయం అవుతుంది అయితే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పాత కందుకూరు గ్రామం లో కాళికామాత ఆలయాన్ని భక్తులు కేవలం 12 గంటల వ్యవధిలోనే నిర్మించారు గ్రామ శివార్లలోని భైరవ స్వామి ఆలయం పక్కన ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు భైరవ స్వామి ఆలయ ధర్మకర్త అయినా ఉయ్యాలవాడ కు చెందిన లక్ష్మీనరసింహశాస్త్రి ఈ బృహత్ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ గా మారారు కాళికామాత అంటే ఒక శక్తి ఆమె ఆలయాన్ని శక్తిపీఠం తో పోలుస్తారు శక్తి పీఠాన్ని కేవలం 12 గంటల్లో నిర్మిస్తే అమ్మవారి ఆశీర్వాదాలు అధికంగా లభిస్తాయి అని భక్తుల విశ్వాసం అందుకే ఈ గ్రామానికి చెందినవారు ఆలయాన్ని 12 గంటల్లో నిర్మించాలని నిర్ణయించారు ఇందుకు కావలసిన శిల్పాలను రాళ్లను నిర్మాణానికి ముందే సిద్ధం చేసుకున్నారు ఈనెల 1వ తేదీ ఆదివారం ఏడున్నర గంటలకు శుభముహూర్తంలో కాళికామాత భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో కలిసి నిర్మాణాన్ని ప్రారంభించారు అందరూ చేయి చేయి కలిపి భుజం భుజం కలిపి ఆలయ నిర్మాణానికి రాళ్లను మోశారు అవసరమైన చోట పెద్ద యంత్రాలను కూడా వినియోగించారు ఇలా ఏకధాటిగా 12 గంటల పాటు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు మొదటి వాయిస్ ఆలయ పూజారి రెండో వాయిస్ ఆలయ ధర్మకర్త మూడో వాయిస్ గ్రామపెద్ద

Body:ఆలయ నిర్మాణం గంటల్లోనే

Conclusion:12 గంటల్లోనే నిర్మాణం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.