ETV Bharat / state

ఉపాధ్యాయులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్న గ్రామస్థులు

కర్నూలు జిల్లాలో రవాణా సౌకర్యాలు లేక ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో విద్యార్థులు లేకుండా పాఠశాలలకు హాజరుకావాలన్న విద్యాశాఖ ఆదేశాలు విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయుల సమస్యలు వర్ణనాతీతం. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లాలో రవాణా సౌకర్యం లేక కొందరు నడుచుకుంటూ... మరికొందరు ద్విచక్ర వాహనాలు, ప్రత్యేక ఆటోల ద్వారా పాఠశాలలకు చేరుకుంటున్నారు.

author img

By

Published : Jul 6, 2020, 8:49 AM IST

teachers
teachers

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 1983 ప్రాథమిక, 367 ప్రాథమికోన్నత, 603 ఉన్నత పాఠశాలల్లో మొత్తంగా 15,188 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరందరిని గత నెల 22 నుంచి విద్యార్థులు లేకుండా పాఠశాలలకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. శనివారం 7,659(50.43)మంది హాజరు కాగా 7,529(49.57)మంది హాజరు కాలేదు. ఇందులో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారితోపాటు గర్భిణులు, శారీరక వైకల్యం కలిగిన ఉపాధ్యాయులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. జిల్లాలో అధికారులు పది మున్సిపాలిటీలు, 47 మండలాలు కంటైన్మెంట్‌ జోన్లుగా పరిగణించారు. ఈ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు.

ప్రస్తుతం జిల్లాలో కరోనా విజృంభిస్తుండటంతో బయోమెట్రిక్‌ యంత్రాల్లో హాజరు వేయడానికి గురువులు భయపడుతున్నారు. హాజరవుతున్న వారిలో ఏ ఒక్కరికి వైరస్‌ సోకినా అందరూ క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తుందని బయోమెట్రిక్‌ వేయడానికి ముందుకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు పనిచేయకపోవడం, మరికొన్నింటికి నెట్‌వర్క్‌ లేక మూలనపడ్డాయి. హాజరుకు విద్యాశాఖ వేలిముద్ర యంత్రాలనే ప్రామాణికం చేసుకోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు.

కరోనా దృష్ట్యా బయోమెట్రిక్‌ హాజరు వినియోగించరాదని మార్చిలో ఆదేశాలు ఇచ్చిన విద్యాశాఖ తాజాగా అదే యంత్రాల్లో హాజరు వేయాలని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ ఇచ్చిన పనుల్లో ఒకరిద్దరు చేయాల్సిన పనుల కోసం ఉపాధ్యాయులందరూ హాజరుకావాలని ఆదేశించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఉపాధ్యాయులను అడ్డుకున్న గ్రామస్థులు

విద్యా శాఖ ఆదేశాల మేరకు గత నెల 23న ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరయ్యారు. కానీ దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామంలో ఉపాధ్యాయులను గ్రామంలోకి రానివ్వకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆ గ్రామంలో జిల్లాపరిషత్‌, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో మొత్తం 12 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరంతా దేవనకొండ, కర్నూలులో నివాసం ఉంటున్నారు. వీరు నివసిస్తున్న ప్రాంతాల్లో కరోనా కేసులు అధికంగా ఉండటంతో అక్కడి ప్రజలు పాఠశాలలను తెరవనీయడం లేదు. అదే రోజు బి.తాండ్రపాడు నుంచి కోడుమూరు జడ్పీ పాఠశాలలో తెలుగు పాఠశాల సహాయకురాలిగా విధులు నిర్వహించడానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మార్గంమధ్యలో ప్రమాదం జరిగింది. ఆ ఉపాధ్యాయిని సలోమి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డోన్‌ పరిధిలోని అధిక పాఠశాలలకు సైతం ఉపాధ్యాయులను స్థానికులు రానివ్వడం లేదు.

ఇబ్బందిగా రవాణా

వివిధ ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయి. ఉపాధ్యాయులు అధిక శాతం జిల్లా, మండల కేంద్రాల నుంచి పనిచేస్తున్న ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. కొవిడ్‌-19 కన్నా ముందు సమయానికి అందుబాటులో ఉన్న ప్రైవేటు, ఆర్టీసీ వాహనాల్లో విధులకు చేరుకునేవారు. ప్రస్తుతం ప్రైవేటు వాహనాలు తిరగడం లేదు. ఒకవేళ తిరుగుతున్నా వైరస్‌ వ్యాప్తి కారణంగా వాటిలో ప్రయాణానికి ఉపాధ్యాయులు భయపడుతున్నారు. కొందరు టీచర్లు స్కూల్స్‌కు వెళ్లడం లేదు. జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ఉపాధ్యాయులు విధులకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సుదీర్ఘ విరామం తరువాత టీచర్లు పాఠశాలలకు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు.

ఇదీ చదవండి:

స్పెషల్ స్టోరీ: కెనడా మెట్రోపై కడప ముద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.