thumbnail

కరవునేలలో జలసిరులు - హొయలొలుకుతూ వీక్షకులకు కనువిందు

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Batrepalli Water Falls in Anantapur District: కరవునేలలో జలసిరులు హొయలొలుకుతూ వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం పైనుంచి గలగల సవ్వడితో జాలువారుతూ పర్యాటకులను ఆకట్టుకుంతోంది బట్రేపల్లి జలపాతం. దేశంలోనే అత్యంత వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలోని తలుపుల మండలం బట్రేపల్లి వద్ద ఉన్న వాటర్ ఫాల్స్ వర్షాకాలంలో పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండమీద నుంచి కిందికి జాలువారుతున్న నీటి ప్రవాహం కనువిందు చేస్తోంది. వాయుగుండం ప్రభావంతో 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలపాతం వేగంగా ప్రవహిస్తోంది. జలపాతం వద్ద హాయిగా గడిపేందుకు చిన్న పెద్ద తేడా లేకుండా పలువురు అక్కడికి చేరి సరదాగా గడుపుతున్నారు. బట్రేపల్లి అటవీ ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వాల వాగ్దానాలు ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బట్రేపల్లి జలపాతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంతవాసులు కాంక్షిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.