Leopard Roaming Near Miyapur Metro Station: హైదరాబాద్లోని మియాపూర్ చిరుత సంచారం కలకలం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల ఉన్న నిర్మాణుష్య ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మెట్రో స్టేషన్ వెనకాల నిర్మాణ పనుల చేస్తున్న సిబ్బంది చిరుత సంచరిస్తున్న వీడియో తీసి స్థానికులను అప్రమత్తం చేశారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు మెట్రో స్టేషన్ చుట్టు పక్కల కాలనీ వాసులను అప్రమత్తం చేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు వీడియో ఆధారంగా చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ శాఖ సిబ్బంది చిరుత ఆవవాళ్లు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.