ETV Bharat / sports

'T20 వరల్డ్​కప్ ఫైనల్ గుర్తుందిగా'- కివీస్​కు మాజీ క్రికెటర్ వార్నింగ్!

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ న్యూజిలాండ్ జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. టీమ్ఇండియాతో కమ్​బ్యాక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.

author img

By ETV Bharat Sports Team

Published : 3 hours ago

Ind vs NZ 1st Test 2024
Ind vs NZ 1st Test 2024 (Source: Associated Press)

Ind vs NZ 1st Test 2024 : న్యూజిలాండ్​తో జరుగుతున్న టెస్టులో భారత్​ కమ్​బ్యాక్ ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్​లో 46 పరుగులకే ఆలౌటైన టీమ్ఇండియా సెకండ్ ఇన్నింగ్స్​లో అద్భుతంగా పుంజుకుంది. మూడో ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 231- 3తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే టీమ్ఇండియా కమ్​బ్యాక్​ను ఉద్దేశించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ న్యూజిలాండ్​కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. భారత్​ను తక్కువ అంచనా వేయోద్దని కివీస్​కు సూచించాడు. 2024 టీ20 వరల్డ్​కప్ ఫైనల్ గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించాడు.

'ఒకవేళ నేను కివీస్ జట్టులో ఉన్నట్లైతే టీమ్ఇండియా కమ్​బ్యాక్ చూసి ఆందోళన చెందేవాడిని. ఈ భారత జట్టుకు కమ్​బ్యాక్ ఇవ్వడంలో మంచి నైపుణ్యం ఉంది. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్​లో సౌతాఫ్రికాకు 30 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన దశలో భారత్ ఇచ్చిన కమ్​బ్యాక్ గుర్తుందిగా' అని ట్విట్టర్​లో పోస్ట్ షేర్ చేశాడు.

అయితే 2024 టీ20 వరల్డ్​కప్​లో సౌతాఫ్రికాకు 30 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన దశలో టీమ్ఇండియా అద్భుతమై చేసింది. పదునైన బౌలింగ్, కట్టుదిట్టమైన ఫీల్డింగ్​తో ఆ మ్యాచ్​లో టీమ్ఇండియా 7 పరుగుల విజయం నమోదు చేసింది. కాగా, ప్రస్తుతం కివీస్​తో టెస్టులోనూ టీమ్ఇండియా అదే తరహాలో కమ్​బ్యాక్ ఇచ్చిందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.

ఇక మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ 125 పరుగుల వెనుకంజలో ఉంది. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉండడం వల్ల మ్యాచ్​పై పట్టు సాధిస్తుందన్న ధీమా ఉంది. క్రీజులో యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (70 పరుగులు) ఉన్నాడు.

అంతకుముందు కివీస్ తొలి ఇన్నింగ్స్​లో 402 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. రచిన్ రవీంద్ర (134 పరుగులు) సెంచరీతో ఆకట్టుకోగా, డేవన్ కాన్వే (91 పరుగులు), టిమ్ సౌథీ (65 పరుగులు) రాణించారు. రవీంద్ర జడేజా 3, కుల్దీప్ యాదవ్ 3, మహ్మద్ సిరాజ్ 2, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.

మూడో రోజు పుంజుకున్న భారత్- రోహిత్, విరాట్ హాఫ్ సెంచరీలు

విరాట్ ఖాతాలో మరో ఘనత​- ఆ మైల్​స్టోన్ అందుకున్న నాలుగో బ్యాటర్​గా రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.