కర్నూలు జిల్లా యనగండ్లలో నందీశ్వరుని విగ్రహాన్ని చోరీ చేయడం దుర్మార్గమని తెదేపా ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య మండిపడ్డారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిందితులను గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహాలపై దాడులు ఆపకపోతే దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. వైకాపా నేతలు దేవుళ్ల పట్ల లెక్కలేనితనంగా వైకాపా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: పుర ఓట్ల లెక్కింపు నేడే.. అభ్యర్థుల్లో ఉత్కంఠ