కర్నూలు శివారులో నిర్మించిన ఎన్టీఆర్ గృహాలను తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు సందర్శించారు. పేదవారి సొంతింటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వం గృహాలను నిర్మించిందన్నారు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముడుపుల కోసమే జాప్యం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే ఇళ్ల పంపిణీ చేపట్టాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కుళ్లిన ఉల్లితో వినియోగదారుల కష్టాలు