కర్నూలు జిల్లాలో గత ఏడాది కాలంలో ఎంత ఇసుక తవ్వారో... ఎంత విక్రయించారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలని తెదేపా సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో ఏడాది నుంచి ఇసుక, మైనింగ్, సారా మాఫియాలు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. తమ కార్యకర్తలపై అనవసరంగా కేసులు పెడుతున్నారన్నారని మండిపడ్డారు.
జిల్లాలో ఫ్యాక్షన్ మొదలైతే... దానికి పోలీసులే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. సీబెళగల్ మండలంలో లిఫ్టు ఇరిగేషన్ సొసైటీని రద్దు చేసి అధికార పార్టీ కార్యకర్తలను నియమించుకోవటం దారుణమన్నారు. వైకాపా ప్రభుత్వం న్యాయస్థానాలను సైతం లెక్కచేయటం లేదని ఆక్షేపించారు.