ETV Bharat / state

ముఖ్యమంత్రి జగన్.. దావూద్ ఇబ్రహీంను మించిపోయారు​:చంద్రబాబు - కర్నూలులో చంద్రబాబు పర్యటన

CHANDRABABU TOUR : తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. జగన్​ మాట్లాడితే ఏదో జరిగిపోతుందని నమ్మి.. ప్రజలు మోసపోయారని తెలిపారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన దేవనకొండలో రోడ్ షో నిర్వహించారు.

chandrababu tour in Kurnool
chandrababu tour in Kurnool
author img

By

Published : Nov 16, 2022, 3:18 PM IST

Updated : Nov 16, 2022, 7:33 PM IST

CBN TOUR IN KURNOOL : కర్నూలు జిల్లా దేవనకొండలో తెదేపా అధినేత చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. జగన్‌ వచ్చాక ఒక్క పరిశ్రమైనా రాష్ట్రానికి వచ్చిందా అని ప్రశ్నించారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయారన్న చంద్రబాబు.. బాధిత రైతులను ఎప్పుడైనా పరామర్శించారా? అని నిలదీశారు. ఆలూరు ఎమ్మెల్యే చేసేది భూకబ్జాలు, పేకాట, మద్యం దందా అని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో జగన్ డ్రామాలు ఆడుతున్నారని.. జగన్.. దావూద్ ఇబ్రహీంను మించిపోయారని ధ్వజమెత్తారు

కోట్ల విజయ్​భాస్కర్​ రెడ్డి విగ్రహానికి నివాళి: సీఎం జగన్‌ను ఇంటికి సాగనంపితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కోడుమూరులోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కర్నూలు , నంద్యాల జిల్లాల్లో ప్రాజెక్టులను పూర్తి చేయకుండా సీఎం కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.

పోలీసులు అధికార పార్టీవారికి వంత పాడటం మానుకోవాలి: గుండ్రేవుల, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినా .. వాటిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఋరోడ్లు పూడ్చలేని సీఎం మూడు రాజధానులు ఎలా కడతారని ఎద్దేవా చేశారు. పోలీసులు అధికారపార్టీకి వంతపాడడం మానుకోవాలని హితవు పలికిన చంద్రబాబు.. తెలుగుదేశం కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

విద్యార్థులతో ముఖాముఖి: రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన కర్నూలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు విమానాశ్రయంలో చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికి.. గజమాలతో సత్కరించారు. అనంతరం అక్కడికి వచ్చిన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరు: జగన్ మాట్లాడితే ఏదో జరిగిపోతుందని అనుకుని.. నమ్మి మోసపోయారని చంద్రబాబు తెలిపారు. కర్నూలు విమానాశ్రయాన్ని తానే కట్టించినట్లు పేర్కొన్నారు. తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరని స్పష్టం చేశారు. హైదరాబాద్​కు ధీటుగా అమరావతిని నిర్మించాలని భావించానని తెలిపారు. ప్రజల్లో చైతన్యం రావాలని కోరారు. విద్యార్థులకు స్కాలర్​షిప్​లు, చదివించే బాధ్యత తెదేపా తీసుకుంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్రమంతా రివర్స్​ పాలన: రాష్ట్రంలో అభివృద్ధి లేదని.. అమరావతిలో రైతుల భూములను కబ్జా చేస్తున్నారని.. విశాఖలో ప్రజల మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ యూనివర్సిటీ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని.. విద్యార్థులు, సిబ్బంది సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రమంతా రివర్స్ పాలన నడుస్తోందని.. యువతకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రి జగన్​ను ఇంటికి సాగనంపితేనే రాష్ట్రానికి మంచి

ఇవీ చదవండి:

Last Updated : Nov 16, 2022, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.