ఆదోని సబ్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విడుదలయ్యారు. నిన్న సమయం ముగియడంతో.. ఈ ఉదయం 6.30 గం.కు విడుదలయ్యారు. సిడీ ఫైల్ ఇవ్వకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి.. బెయిల్ రాకుండా అడ్డుకున్నారని జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. కస్టడీ అవసరం లేకున్న.. బెయిల్ రావడానికి జాప్యం చేశారని అధికారుల తీరును ఆయన విమర్శించారు.
గత నెల 23న ఘర్షణ కేసులో ఆయనను అదే రోజు అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 307, 147, 148, 324, 341తోపాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఆయన ఆదోని సబ్ జైల్లో ఉన్నారు. జనార్ధన్ రెడ్డి విడుదలతో.. బనగానపల్లిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. విడుదల సందర్భంగా పట్టణంలోని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రధాన కూడళ్లలో పోలీసులను మోహరించారు.
ఇదీ చదవండి: