నెల్లూరు జిల్లాలో ఇసుకను అక్రమంగా కొల్లగొడుతూ.. కోట్లు దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు తెదేపానేతలు వినతిపత్రం అందజేశారు. గొల్లకందుకూరులోని ఇసుక రీచ్‌లో.. పది రోజుల వ్యవధిలోనే 500 కోట్ల రూపాయల విలువ చేసే ఇసుకను తరలించారని తెదేపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆరోపించారు.
సరైన బిల్లులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టెండరుదారులకు కేటాయించిన ఇసుకను పది రోజుల వ్యవధిలోనే తరలించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. అదే విధంగా గొల్ల కందుకూరు ఇసుక రీచ్‌లో జరుగుతున్న అక్రమాలపై అబ్దుల్ అజీజ్.. గనులు, భూగర్భ శాఖ డీడీకి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: