కర్నూలు జిల్లా కోసిగి మండలం మూగలదొడ్డిలో ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మూగలదొడ్డి గ్రామానికి చెందిన కురువ బసవరాజు (10) కురువ శివలింగప్ప (12) ఇద్దరూ గొర్రెలు మేపేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ లేక భర్తకు నోటితో ఊపిరూదిన భార్య