ఓంకార క్షేత్రంలో రాష్ట్రస్థాయి యోగాసన, శంఖునాదం పోటీలు కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారం క్షేత్రంలో రాష్ట్రస్థాయి యోగాసన, శంఖునాదం పోటీలు నిర్వహిస్తున్నారు. ఓంకార సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను నాగ సన్యాసులు ప్రారంభించారు. పోటీలు రెండ్రోజుల పాటు జరగనున్నాయి. ఓంకారం క్షేత్ర ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఓంకార సాధన సమితి సభ్యులు తెలిపారు. భక్తుల ఓంకార నాదంతో క్షేత్రం మార్మోగింది. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి కళాకారులు క్షేత్రానికి తరలివచ్చారు.
ఇదీ చదవండి :
కొనుగోలు ఆలస్యం... ఉల్లి రైతు ఆత్మహత్యాయత్నం...