శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. మొత్తం 8 లక్షల 65 వేల 55 క్యూసెక్కుల వరద జలశయానికి వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.1 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.81టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 199.27 టీఎంసీలుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38 వేల 140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31 వేల 170 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 2వేల 25 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఇది కూడా చదవండి