కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో స్వామి వారి దర్శనంకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. గాలిగోపురం వద్ద వేద పండితులు గోపూజ నిర్వహించారు. మహా నందీశ్వర స్వామిని కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్, ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, సిబ్బంది దర్శించుకున్నారు.
ట్రయల్ రన్ రెండు రోజుల పాటు కొనసాగుతుందని... 10వ తేదీ నుంచి అందరికి దర్శనం ఉంటుందని కార్యనిర్వహణాధికారి తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులు నిబంధనల ప్రకారం.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: