కర్నూలుకు చెందిన శ్రీనివాసులు వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. అయితే అతను అమితమైన జంతు ప్రేమికుడు. నగంరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఉన్న కుక్కలకు, పిల్లులకు, ఎలుకలకు, కాకులకు, ఆవులకు ప్రతి నిత్యం ఆహారం అందిస్తున్నాడు.
వ్యాయమం చేసేందుకు శ్రీనివాసులు దంపతులు రోజు ఉదయం మైదానానికి వస్తుంటారు. వ్యాయామం అనంతరం అక్కడే ఉన్న వీధి కుక్కలకు ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చిన అన్నం పెడతారు. కాకులకు రోజు కేజీ బూందీ వేస్తుంటారు. దీంతో ఎక్కువ సంఖ్యలో కాకులు అక్కడే ఉంటున్నాయి. ఎలుకల కోసం అన్నం, బొరుగులు వేస్తుంటాడు.
రెండు కేజీల పిండిని తీసుకుని వచ్చి వీధుల్లో తిరిగే ఆవులకు తినిపిస్తుంటారు. వీధుల్లో ఆవులు కనబడకపోతే గోశాలకు వెళ్లి ఆవులకు ఆ పిండిని ఇస్తాడు. పిల్లుల కోసం రోజు ఐదు లీటర్ల పాలు, కేజీ చికెన్ పకోడా సైతం అందిస్తున్నారు. రోజు మూగ జీవుల కోసం రూ.700 ఖర్చు చేసి శ్రీనివాసులు చేస్తున్న సేవ కార్యక్రమాలకు స్థానికులు అభినందిస్తున్నారు. మూగ జీవులకు ఆహారాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని శ్రీనివాసులు దంపతులు అంటున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 5,653 కరోనా కేసులు, 35 మరణాలు
మానవత్వం చాటుతున్న జంతు ప్రేమికులు