శ్రావణమాసం సందర్భంగా ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్న రణమండల కొండ స్వామి కి భక్తులు పోటెత్తుతున్నారు. కొండల్లో ఉన్న స్వామిని దర్శనం చేసుకునేందుకు వంద మెట్లెక్కుతూ ఉత్సాహంగా సాగుతున్నారు. భక్తులు ప్రత్యేకంగా చేయించిన 45 కేజీల వెండి కవచాన్ని స్వామికు తొడిగారు. తెలంగాణ,కర్ణాటక నుండి భక్తులు ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివారు ప్రాంతం కావడంతో భక్తులు కోసం ప్రత్యేకంగా రవాణసౌకర్యాలు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి