- పుష్కర విధులు... రెండు షిఫ్టులు..
అధికారుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల వరకు అందరికీ పుష్కరాల్లో విధులను రెండు షిఫ్టులుగా కేటాయించారు. ఘాట్లకు సైతం ఇద్దరు ఇన్‌ఛార్జులను నియమించడంతో ఉదయం షిఫ్టు 6 గంటలు, రెండో షిఫ్టు 6 గంటలు విధులను పంచారు. ఘాట్ల వద్ద పురోహితులకు చెల్లించాల్సిన ధరలపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అధికారులకు విశ్రాంతి తీసుకోవడానికి సదుపాయాలను సైతం ఏర్పాటు చేశారు.
- పుష్కరాలకు 54 ప్రత్యేక బస్సులు..
కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతోపాటు కర్నూలు నగరంలోని పుష్కర ఘాట్లకు సాధారణ ఛార్జీలతో బస్సులు నడుపుతున్నట్లు ప్రాంతీయ అధికారి వెంకట రామం తెలిపారు. జిల్లాలో 54 ప్రత్యేక బస్సులు శుక్రవారం నుంచి నడుస్తాయని, ప్రయాణికులు సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: మంత్రాలయంలో ఘనంగా ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు