కర్నూలు జిల్లాలో జరిగిన స్పందన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జయరాం మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజల సమస్యలను చాలా దగ్గర నుంచి చూశారని వారికి ఎలాంటి సమస్యలున్నా ఎక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఎప్పటికప్పుడు ఈ సమస్యలను పరిష్కరించాలని నిర్దిష్టమైన సమయాన్ని సూచిస్తూ దానికి సంబంధించిన రసీదులను అందజేయాలని కార్మిక ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అధికారులకు తెలిపారు.
ఇదీ చదవండి లారీ, ద్విచక్రవాహనం ఢీ... బాలిక మృతి