ఈ నెల 24న కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన రౌడీషీటర్ రాజశేఖర్ హత్య కేసులో.. ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారిలో ఉన్నాడు. రాజశేఖర్‌కు.. అతని బంధువైన సంజీవకుమార్ అనే వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు ఉండేవని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో వారికి మనస్పర్థలు వచ్చాయన్నారు.
ఎలాగైనా రాజశేఖర్ ను హత్య చేయాలని భావించిన సంజీవకుమార్... మరో ఆరుగురితో కలిసి ప్రణాళిక ప్రకారం హతమార్చాడు. వారిలో సంజీవకుమార్తోపాటు మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు. కేసు విచారణ జరుగుతోందన్నారు.
ఇవీ చూడండి: