కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలంలోని మూడు ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు... దొంగతనానికి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి దాదాపు వంద తులాల వెండి, రూ.80 వేలు నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా వేలిముద్రలు సేకరించారు.
గత నెలలో సిరివెళ్ల మండల పరిధిలోని మూడు గ్రామాల్లోని ఆలయాల్లో దొంగలు చోరీ చేసి వెండి ఆభరణాలను అపహరించారు. వరసగా జరుగుతున్న ఈ ఘటనలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదీచదవండి.