కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలో జరిగిన వినాయక నిమజ్జనంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ వేడుకలో పగిడ్యాల ఎస్ఐ శ్రీనివాసులు.. తమ సిబ్బందితో కలిసి విధులు నిర్వహించారు. అనంతరం ఎస్ఐ శ్రీనివాసులు డ్యాన్స్ చేశారు. గొడవలు జరగకుండా, శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు నృత్యం చేయడం ఏమిటని పలువురు విమర్శలు చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఇదీచదవండి.