ఎలాంటి అనుమతలు లేకుండా ఆటోలో పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న వ్యక్తిని కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. కల్లురు మండలం ఉల్లిందకొండ గ్రామానికి చెందిన బోయ రామనాయుడు అనే వ్యక్తి ఆటోలో 782 జిలిటెన్ స్టిక్స్, 800 డిటోనేటర్లు తరలిస్తుండగా నాగులాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఆటోను పట్టుకున్నారు. ఆటోలో తరలించేందుకు పేలుడు పదార్థాలు ఇచ్చిన వాసయ్యపై కేసు నమోదు చేశారు. పేలుడు పదార్థాలతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కె.వి. మహేష్ తెలిపారు.
ఇదీ చదవండి: