రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేస్తూ కేబినెట్లో తీర్మానం చేయాలని రాయలసీమ హక్కుల కమిటీ డిమాండ్ చేసింది. సీమకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదన్న నేతలు.. బ్రిటీష్ పాలకులపై పాలెగాళ్లు చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తామని హెచ్చరించారు. రాయలసీమ బిడ్డగా ఇక్కడి ప్రజల మనోభావాలను స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జగన్ నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. రాయలసీమకు అన్యాయం జరిగితే ఇడుపులపాయ నుంచి దిల్లీ వరకూ స్తంభింపజేస్తామన్నారు. అక్రమ కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా భయపడేది లేదని తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి: ఎల్లుండి కేబినెట్ భేటీ... రైతులకు పోలీసుల నోటీసులు