కర్నూలు సరిహద్దు పంచలింగాల వద్ద ఎస్ఈబీ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో తెలంగాణలోని అలంపూర్ నుంచి పత్తికొండలోని పగిడిరాయికి తరలిస్తున్న 144 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా వాహనం కింద భాగంలో మద్యం సీసాలను పెట్టినట్లు చెప్పారు. మద్యం తరలించటానికి ఉపయోగించిన వాహనంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్