ETV Bharat / state

అవుకు ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు - owk SI srikanth reddy news

వ్యక్తిని దూషించారన్న ఆరోపణలతో కర్నూలు జిల్లా అవుకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.

owk si
owk si
author img

By

Published : Dec 12, 2020, 9:32 PM IST

కర్నూలు జిల్లా అవుకు ఎస్సై శ్రీకాంత్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తాను ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తనిఖీ పేరుతో ఎస్సై తనను ఆపి దూషించారని అవుకు మండలంలోని ఇస్రానాయక్ తండాకు చెందిన జయరాముడు అనే వ్యక్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలతో శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టారు.

మరోవైపు శ్రీకాంత్ రెడ్డి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఇటీవలే చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాడు. దీనిపై రాష్ట్రపతి భవన్​కు వివరణ ఇచ్చేందుకు సదరు ఎస్సై దిల్లీ వెళ్లారు. ఆయన దిల్లీలో ఉండగానే అవుకు పోలీసు స్టేషన్​లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి

దారుణం.. నాలుగేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.