కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అవుకు రోడ్డులోని బృందావన లేఅవుట్లోకి బీసీ జనార్దన్ రెడ్డి అనుమతులు లేకుండా అక్రమంగా వెళ్లారని కుమారస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. లేఅవుట్ దగ్గర ఉన్న రాళ్లను జనార్ధన్ రెడ్డి తొలగించి.. తనకు నష్టం చేకూర్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: