కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ డిపొలో అప్రెంటిస్‌గా విధులు నిర్వర్తిస్తున్న సిసింద్రీ గౌడ్.. విద్యుదాఘాతంతో మృతి చెందాడు. డిపో గ్యారేజీలో ఉన్న బస్సులో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ సరఫరా అవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సిసింద్రీ గౌడ్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.