ETV Bharat / state

రౌడీ గ్యాంగ్ హల్​చల్.. ఇనుప రాడ్లతో యువకుడిపై దాడి

author img

By

Published : Jun 28, 2020, 10:10 PM IST

ఓ రౌడీ గ్యాంగ్ యువకుడిపై దాడికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జరిగింది. తమ గ్యాంగ్​లో చేరనందుకు కక్ష పెంచుకొని తనపై ఇనుపరాడ్లతో దాడి చేశారని క్షతగాత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రౌడీ గ్యాంగ్ హల్​చల్..ఇనుప రాడ్లతో యువకుడిపై దాడి !

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఓ రౌడీ గ్యాంగ్ హల్​చల్ చేసింది. యువకుడిపై ఇనుపరాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. గాయపడ్డ వ్యక్తి తలకు తీవ్ర గాయాలు కావటంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ గ్యాంగ్​లో చేరమని బలవంతం చేయగా... అందుకు అంగీకరించనందుకు తనపై దాడి చేసినట్లు క్షతగాత్రుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.