ETV Bharat / state

లోకల్​ ఛానల్​లో 'గేమ్​ఛేంజర్​' మూవీ ప్రసారం - నిందితుల అరెస్టు - GAME CHANGER MOVIE

ఆంధ్రప్రదేశ్​లోని లోకల్​ ఛానల్​లో 'గేమ్​ఛేంజర్​' పైరసీ మూవీ - ఛానల్​ నిర్వాహకుల అరెస్టు

Game Changer Film Telecast on Local Channel Accused Arrested
లోకల్​ ఛానల్​లో 'గేమ్​ఛేంజర్​' మూవీ ప్రసారం - నిందితుల అరెస్టు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2025, 11:55 AM IST

Game Changer: చిరంజీవి తనయుడు రామ్​చరణ్​ హీరోగా శంకర్​ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గేమ్​ఛేంజర్​'. ఈ మూవీ విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లోని ఒక లోకల్‌ ఛానల్‌లో పైరసీ కాపీని ప్రసారం చేయడంపై చిత్రబృందం ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంది. సినిమా విడుదలై వారం రోజులు కూడా గడవకముందే ఆంధ్రప్రదేశ్‌లోని ఓ లోకల్‌ ఛానల్‌లో టెలీకాస్ట్​ చేయడం అంతటా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన చిత్రబృందం ఇటీవల సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు జరిపి తాజాగా ఆ ఛానల్‌ నిర్వాహకులను అరెస్ట్‌ చేశారు. సైబర్‌ క్లూస్‌ టీమ్‌ టీవీ ఛానల్‌పై దాడి చేసి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

'టికెట్ ధరలను ఊరికే పెంచడం లేదు' - గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్ కీలక వ్యాఖ్యలు

సోషల్​ మీడియా వేదికగా నెటిజన్​ పోస్టు : ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని తమ ప్రాంతంలోని లోకల్‌ ఛానల్‌లో ప్రసారం చేస్తున్నారని పేర్కొంటూ ఇటీవల ఒక నెటిజన్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను కూడా షేర్‌ చేశాడు. దీనిపై సినీ ప్రముఖులు, ప్రియులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సినిమా వెనక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉంటుందన్నారు. పైరసీ కాపీని ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని, దీనివల్ల ఎంతోమంది నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

బాబాయ్ గురించి అబ్బాయ్ కామెంట్స్ - నెట్టింట వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్! చూశారా ?

GAME CHANGER FILM PIRACY : పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా ‘గేమ్‌ ఛేంజర్‌’ రూపుదిద్దుకుంది. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీనిని నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాని లీక్‌ చేస్తామంటూ బెదిరించిన వారిపై చిత్రబృందం సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారని, రిలీజ్‌ కాగానే ఆన్‌లైన్‌లో లీక్‌ చేశారని టీమ్‌ ఫిర్యాదులో పేర్కొంది. ఆధారాలు సేకరించిన చిత్ర బృందం.. 45 మందితో కూడిన ముఠాపై ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే, సోషల్‌ మీడియా వేదికగా సినిమాపై నెగెటివిటీ సృష్టిస్తున్న కొన్ని ఖాతాల పైనా ‘గేమ్ ఛేంజర్‌’ టీమ్‌ కంప్లైంట్‌ ఇచ్చింది.

'గేమ్ ఛేంజర్' రివ్యూ - డ్యూయెల్​ రోల్​లో చెర్రీ మెప్పించారా?

రాజమహేంద్రవరంలో మెగా పవర్ ఈవెంట్ - ఒకే స్టేజ్‌పై బాబాయ్‌-అబ్బాయ్‌ సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.