Navodaya Vidyalaya Exam Date 2025 : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఎంతో నైపుణ్యమైన విద్యనందించేందుకు జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం జనవరిలో 6వ తరగతిలో ప్రవేశానికి పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి విద్యార్థులకు ఈ నెల 18న పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నవోదయ ఎగ్జామ్‌కు వెళ్లే విద్యార్థులకు నిపుణులు కొన్ని ముఖ్య సూచనలను తెలియజేస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం.
ఇప్పటికే జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు అప్లై చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి.
సూచనలు :
- ఎగ్జామ్ రాసే విద్యార్థులు రెండు హాల్ టికెట్లు డౌన్‌లోన్ చేసుకోవాలి.
- హాల్ టికెట్‌పై సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు సంతకం చేసిన ఒక హాల్ టికెట్ ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి.
- బ్లాక్ లేదా బ్లూ పెన్నుతోనే పరీక్ష రాయాలి.
- గంట ముందుగా విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకోవాలి.
- విద్యార్థులు తమ వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు.
- రాత పరీక్ష ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు ఉంటుంది.
- విద్యార్థులను 10.45 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తారు.
- మార్నింగ్ 11 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు.
- తర్వాత ఒక్క నిమిషం అలస్యమైనా పరీక్ష కేంద్రంలోపలికి అనుమతించరు.
పరీక్ష విధానం :
నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ప్రశ్నపత్రంలో 80 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. ప్రతీ ప్రశ్నకు 1.25 మార్కులు ఉంటాయి. మేధాశక్తిలో 40 ప్రశ్నలకు 50 మార్కులు, మ్యాథ్స్‌లో 20 ప్రశ్నలకు 25 మార్కులు, భాషా పరిజ్ఞానంలో 20 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి. ఆపై రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.
మరికొన్ని సూచనలు :
- పరీక్షకు ముందు రోజు బాగా నిద్రపోండి.
- ప్రతి ప్రశ్నను రెండుసార్లు చదివి, అర్థం చేసుకుని ఆ తర్వాత సమాధానం ఇవ్వండి.
- పశ్నకు అందించిన అన్ని ఆప్షన్లను జాగ్రత్తగా చదివి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
- ఒక ప్రశ్నపై ఎక్కువ సమయం వృథా చేయవద్దు. ప్రశ్న కఠినంగా అనిపిస్తే తర్వాత ప్రశ్న చదవండి.
- మీకు తెలియని ప్రశ్నలను తర్వాత చేయండి.
ఆల్ ది బెస్ట్!
నిరుద్యోగులకు అల్టర్- IBPS ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్- కచ్చితంగా తెలుసుకోవాల్సిన డేట్స్ ఇవే!
మీ టెన్త్ సర్టిఫికెట్లో స్పెల్లింగ్ తప్పు పడిందా? - ఏం చేయాలో తెలుసా?