.
"సీమలోనే... హైకోర్టు ఏర్పాటు చేయాలి" - tdp comments on capital issues
కర్నూలులోని ఓ హోటల్‌లో రాయలసీమ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ పార్టీల నుంచి ముఖ్య నాయకులు హజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నేతలు మాట్లాడుతూ... అమరావతిని తరలిస్తే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. సీమలో హైకోర్టుని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. రాజధానిగా విశాఖను ఎలా చేస్తారని ప్రశ్నించారు. జిల్లా ప్రజలు అక్కడికి ప్రయాణించడానికే పది గంటల సమయం పడుతుందని మండిపడ్డారు.అనంతరం రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కర్నూలులో రాయలసీమ పరిరక్షణ కోసం రౌండ్ టేబుల్ సమావేశం
.
sample description