కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన మూడు కొత్తరకం పత్తి విత్తనాలు జాతీయ స్థాయిలో విడుదలయ్యాయి. పత్తిలో సూటి(బీటేతర) రకాలైన ఎన్.డి.ఎల్.హెచ్_2028- 2, ఎన్.డి.ఎల్.హెచ్_2051-1, ఎన్.డి.ఎల్.హెచ్- 2005-4 అందుబాటులోకి వచ్చాయి.
20051-1 రకం మధ్య, దక్షిణ భారత రాష్ట్రాల్లో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 16 రకాలు విడుదల కాగాా.. అందులో నంద్యాలకు చెందినవి మూడు రకాలు ఉన్నట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహా సంచాలకులు డాక్టర్ మురళీ కృష్ణ తెలిపారు. ఈ రకాల్లోని అన్నీ అంశాలు మేలుగా ఉండటంతో జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు.
ఇదీ చదవండి: శిథిలావస్థలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్ పోస్ట్