కర్నూలులోని ఓ ప్రైవేటు హోటల్లో భాజపా రాయలసీమ జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా భాజపా జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్ హాజరయ్యారు. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలపై వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల ముఖ్యనేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి cm review: వినాయక చవితి ఇళ్లలోనే...కొవిడ్ సమీక్షలో సీఎం