Rape Attempt: మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదు.. నిత్యం ఏదో ఒకచోట దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా.. మద్యం మత్తులో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తప్పు చేస్తే జీవితాలు నాశనమవుతుందనే విచక్షణ కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే కర్నూలు జిల్లాలో జరిగింది.
కోసిగి మండలం వందగల్లులో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కామాంధులు ఓ వివాహితపై అత్యాచారయత్నం చేశారు. ఆరు బయట నిద్రిస్తున్న బాధితురాలి తండ్రిని కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి నిందితులు దారుణానికి ఒడికట్టారు. బాధిత మహిళ కేకలు వేయటంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా 'మాపైనా కేసు పెడతారా' అంటూ నిందితుల కుటుంబ సభ్యులు బాధితురాలు, ఆమె భర్తపై దాడికి దిగారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని బాధితురాలు పోలీసులను వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి