కర్నూలు జిల్లా ఆదోని శివారు కొండల్లో వెలసిన శ్రీ రణమండల ఆంజనేయ స్వామి ఆలయంలో.. శ్రావణ మాస ఉత్సవాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పాండురంగయ్య శెట్టి తెలిపారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఆంజనేయస్వామికి ప్రత్యేకంగా భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. 41 రోజులు వందల మెట్లు ఎక్కుతూ.. వేల సంఖ్యలో భక్తులు కొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కారణంగా అధికారుల ఆదేశాల మేరకు ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ సభ్యులు వెల్లడించారు. కొండకు భక్తులు ఎవరూ రావద్దని, ఇంట్లోనే ఆంజనేయస్వామికి పూజలు చేసి మొక్కులు తీర్చుకోవాలని కోరారు. స్వామివారికి ప్రతి రోజు పూజా కైంకర్యాలు జరుగుతాయని తెలిపారు.
ఇవీ చూడండి: