ETV Bharat / state

'కొనుగోళ్లు లేక నష్టపోతున్న వ్యాపారులు' - 'రైతు బజార్​ను ప్రారంభించాలి'

పంచాయతీ వారు రైతు బజార్​ ఏర్పాటు చేసిన... ప్రారంభానికి నోచుకోక నష్టపోతున్నామని పత్తికొండ వ్యాపారస్థులు వాపోతున్నారు.

raithu bazar
పత్తికొండ రైతు బజార్
author img

By

Published : Dec 17, 2019, 7:59 AM IST

Updated : Dec 17, 2019, 8:22 AM IST

కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే వారపు సంతలో ప్రతి సోమవారం భారీగా ప్రజలు తరలి వస్తారు. కూరగాయలు, ఇతర సరకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీని కోసం పంచాయతీ శాఖ... రైతు బజార్‌ భవనాన్ని నిర్మించారు. అయితే ఇప్పటికీ ఆ భవనం ప్రారంభానికి నోచుకోక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు ప్రధాన రహదారిపై దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు పంచాయతీ మార్కెట్ స్థలంలోనే దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. లోపల ఉన్న వారికి వ్యాపారం లేక మార్కెట్ వెలవెలబోతోంది. ప్రజలు రోడ్డుపైనే ఉన్న వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తుండగా... తమ వద్దకు ఎవరూ రావడం లేదంటున్నారు వ్యాపారులు. ఇప్పటికైనా రైతు బజార్ ప్రారంభించి ఇబ్బందులు తీర్చాలంటున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి కృష్ణకుమార్ దృష్టికి తీసుకెళ్లగా.. రైతు బజార్ ప్రారంభంతోపాటు... మార్కెట్లోని వ్యాపార ఇబ్బందులు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

పత్తికొండ రైతు బజార్

ఇవీ చదవండి...'ఉజ్జయిని' టూ 'శబరిమల'.. అయ్యప్ప భక్తుడి పాదయాత్ర

Intro:ap_knl_91_16_praramvhamkaani _raithu bajaar_pakage_ap10128.... పంచాయతీ వారు ఏర్పాటు చేసిన మార్కెట్లో కూరగాయలు ఇతర సరుకులు అమ్ముడు పోక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే వారపు సంతలో ప్రతి సోమవారం భారీగా ఇతర గ్రామాల నుంచి కూరగాయలు , ఇతర సరుకులు కొనుగోలు కోసం ప్రజలు తరలి వస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రైతు బజార్ భవనాన్ని నిర్మించినా, ఇప్పటివరకు ప్రారంభించక పోవడంతో కొందరు ప్రధాన రహదారిపై దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తుండగా, మరికొందరు పంచాయతీ వారు ఏర్పాటు చేసిన లోపల ఉన్న మార్కెట్ స్థలంలో కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే రహదారిపై ఏర్పాటు చేసుకున్న వారికి వ్యాపారం బాగా జరుగుతోంది . లోపల ఉన్న వారికి వ్యాపారం లేక మార్కెట్ వెలవెలబోతోంది . ప్రజలు రోడ్డుపైనే ఉన్న వ్యాపారుల వద్ద అ కొనుగోలు చేస్తుండగా మా వద్దకు ఎవరూ రావడం లేదంటూ మార్కెట్లో వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికైనా రైతు బజార్ ను ప్రారంభించి వ్యాపారులు ప్రజల ఇబ్బందులు తీర్చాలంటూ కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి కృష్ణకుమార్ దృష్టికి తీసుకెళ్లగా రైతు బజార్ ప్రారంభం తో పాటు మార్కెట్లోని వ్యాపార ఇబ్బందులు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822
Last Updated : Dec 17, 2019, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.