కర్నూలు జిల్లా కోవెలకుంట్ల తహసీల్దార్ పాత కార్యాలయంలో కొండ చిలువ హల్చల్ చేసింది. దీని పక్కనే ఇటీవలే నిర్మించిన నూతన భవనానికి కార్యాలయాన్ని తరలించారు. ప్రస్తుతం కొత్త బిల్డింగ్‌లోనే అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. పాత కార్యాలయంలో కొందరు అధికారులు తమ రికార్డులను భద్రపర్చుకున్నారు. ఫలితంగా రెండు ఆఫీసులకు రాకపోకలు సాగిస్తుంటారు.
తప్పిన ప్రమాదం..
కొన్ని సమయాల్లో అక్కడే విధులను నిర్వహించుకునేవారు. ఈ క్రమంలో ఊహించని రీతిలో ఓ గదిలో ఆరు అడుగుల కొండచిలువ కలకలం సృష్టించింది. పక్కనే సుమారు డెబ్బై గుడ్లను సైతం పెట్టడంతో అధికారులు ఉలిక్కి పడ్డారు. ఎట్టకేలకు బనగానపల్లి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో కొండ చిలువతో సహా గుడ్లను తరలించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో అధికారులు తమ రికార్డులను కొత్త తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
ఇవీ చూడండి : కరోనాకు ఆయుర్వేద మందు.. తిరిగి పంపిణీకి సన్నాహాలు